Today News
అంబులెన్స్కు కి దారి ఇద్దాం....ప్రాణం నిలబెడదాం.....రేపటి రోజును కాపాడుదాం.....
అంబులెన్స్ మన వెనకో మన ముందు మన పక్కన మనకు తరచూ కనిపిస్తూనే ఉంటుంది కానీ మనం దాన్ని పట్టించుకోకుండా మన రోజువారీ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాయి కనీసం వారికి దారి కూడా వదలకుండా ఉండటం ఎంతవరకు న్యాయం.
సరిగ్గా గమనించండి జస్ట్ వెహికల్ కాదు ఇది కొనఊపిరితో కొట్టుకుంటున్న జీవితం ఇది.
సైరన్ కాది ఇది ఏడుస్తున్న చావు కేక ఇది.
చావు బ్రతుకుల తో కొట్టుమిట్టాడుతున్న ప్రాణం విలువ ఇది.
మనలాగే మనుషులు ఉన్నారు ఏమో
మనకు కావాల్సిన వారు ఉన్నారేమో
ఏమో రేపు మనమే ఉంటామేమో
దయచేసి అంబులెన్స్ కి దారిని ఇవ్వండి కొన ఊపిరి ని వదలండి. మీ మనసు విశాలం చేస్తే రోడ్లు కూడా చాలా విశాలం అవుతాయి. మనసున్న మనిషిగా మంచి చేసే వ్యక్తిగా ఒక పౌరుని బాధ్యతగా భావించి అంబులెన్స్ కి దారి ని ఇద్దాం.
గుండెనొప్పితో ఒకరు , యాక్సిడెంట్ అయి మరొకరు, అనారోగ్యంతో ఒకరు, అనుబంధాలను తెంచుకుంటూ ఆత్మహత్య చేసుకుంటూ ఇంకొకరు, ఆయుష్షును హరించి హత్య చేయబడి మరొకరు.
ఇలా రకరకాలుగా జీవితాలు చిన్నాభిన్నమై కొనఊపిరితో కొట్టుకుంటూ నడిరోడ్డుపై సైరన్ అరుపులు మనకు వినబడినప్పుడు దయచేసి వారికి దారిని ఇద్దాం మనుషుల ప్రాణాలను కాపాడుదాం.
మనుషులలో మార్పు రావాలి సమాజంలో చైతన్యం కలగాలి.
దీనిని మంచి కోరి మంచి మనసుతో నలుగురికి తెలియజేద్దాం కొందరి ప్రాణాలనైనా నిల పెట్టగలిగిన వారమవుతాం.
జై హింద్
ఎల్లప్పుడూ మీ మంచి కోరే
పబ్లిక్ న్యూస్ జోన్ యాజమాన్యం.
Previous article
Next article
Leave Comments
Post a Comment