calendar
TTD calendar 2020 PDF download
మా వినియోగదారులకు మరియు మిత్రులకు సన్నిహితులకు నూతన సంవత్సరానికి సంబంధించి కొత్తగా రిలీజ్ చేసినటువంటి క్యాలెండరు మీకోసం.
క్యాలెండర్ అంటే అలాంటి ఇలాంటి క్యాలెండర్ కాదండి ఇది తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వెలువడిన అటువంటి క్యాలెండర్ ఈ క్యాలెండర్ కు డిమాండ్ చాలా ఎక్కువ కేవలం మీకోసం ఈ క్యాలెండర్ ను మేము మన పబ్లిక్ న్యూస్ జోన్ లో పొందు పరిచాము.
దీనికి గల ముఖ్య కారణం ఏమంటే మాకు చాలా సన్నిహితం అయినటువంటి మరియు మాకు నాన్న గారి తో సమానం అయినటువంటి విజయ్ సింహ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఆయనకు ఇష్టమైన టువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి నుండి వెలువడిన టువంటి ఈ క్యాలెండర్ను మేము మా వినియోగదారులకు మరియు మిత్రులకు అందరికీ ఉచితంగా అందిస్తున్నాము పిడిఎఫ్ ఫార్మాట్ లో.
దీనితో పాటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మాకు తెలిసినటువంటి కొన్ని సత్యాలను మీతో పంచుకోవాలని అనిపించింది.
తిరుమల తిరుపతి దేవస్థానం గురించి అందరికీ తెలిసిందే. దేశంలోనే అత్యంత సంపద కలిగిన ఆలయంగా ప్రసిద్ధిగాంచిన తిరుమలలో ఎన్నో ఆసక్తికర రహస్యాలు దాగి ఉన్నాయి. అవేంటో తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యచకితలవుతారు. మళ్లీమళ్లీ తిరుమల దర్శనానికి మొగ్గు చూపుతారు. రోజూ లక్ష నుంచి రెండు లక్షలకు పైగా భక్తులకు దర్శనమిచ్చే వేంకటేశ్వర స్వామి సంపదను తూచడం అంత సులభం కాదు. దాదాపు eleven టన్నులకు పైగా ఆభరణాలు స్వామివారికి ఉన్నట్లు చెబుతుంటారు. మరి, తిరుమల గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందామా.
TTD calendar 2020 PDF download
TTD calendar 2020 PDF download
1. గర్బగుడిలోని శ్రీవారికి అభిషేకాలకు, పూజలకు వాడే పాలు, నెయ్యి, వెన్న, ఆకులు, పుష్పాలు ఓ రహస్య గ్రామం నుంచి వస్తాయి. ఈ గ్రామం శ్రీవారి ఆలయానికి దాదాపు twenty two కిమీల దూరంలో ఉంది. ఇక్కడి గ్రామస్థులు చాలా చాలా సంప్రదాయబద్దంగా ఉంటారు. ఇక్కడి స్త్రీలు రవికలు కూడా ధరించరని చెబుతుంటారు. అయితే, ఇక్కడికి సామాన్యులకు ప్రవేశం ఉండదు. కేవలం ఆ గ్రామానికి చెందినవారు మాత్రమే ఆ గ్రామంలో అడుగుపెట్టాలి.
2. వెంకటేశ్వర స్వామి విగ్రహానికి జుట్టు వుంటుంది. ఇది అస్సలు చిక్కు పడదని అంటారు. శ్రీవారు భూవి మీదకు వచ్చిన తర్వాత ఓ ఊహించని ప్రమాదంలో జుట్టును కోల్పోతారు. ఇది తెలిసిన నీలా దేవీ అనే గాంధర్వ రాకుమారి తన శిరోజాల నుంచి కొంత భాగం ఆయనకు ఇస్తుంది. ఇందుకు ఆయన అంగకరించి జుట్టు కోల్పొయిన ప్రాంతంలో అతికిస్తారు. అప్పటి నుంచి తిరుమల దర్శనానికి వెళ్లే భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించడం అనవాయితీగా వస్తోంది.
3. బాలుడి రూపంలో ఉన్న స్వామివారిని గుణపంతో అనంతాల్వారు గుణపంతో కొడతాడు. దీంతో స్వామివారి గడ్డంపై గాయమై రక్తం వస్తుంది. అప్పటి నుంచి స్వామివారి గడ్డానికి గంధం పూయటం సంప్రదాయంగా వస్తోంది. ఆ గుణపం గుడి ముందు మహాద్వారానికి కుడివైపున ఉంటుంది.
4. స్వామివారు గర్భగుడి మధ్యలో వున్నట్లు కనిపిస్తారు. అయితే, ఆయన గర్భగుడి కుడి వైపునకు ఉంటారు.
5. స్వామి వారి విగ్రహం వెనుక వైపున సముద్ర హోరు వినిపిస్తుంది. స్వామి వీపు వైపున చెవి పెడితే ఆ హోరు స్పష్టంగా వినిపిస్తుంది.
6. స్వామివారిని రోజూ కింద పంచె, పైన చీర తో అలంకరిస్తారు.
7. సాధారణంగా ఆలయాల్లో దేవుడికి అలంకరించిన పూలను భక్తులకు ఇస్తుంటారు. అయితే, శ్రీవారి విగ్రహానికి అలంకరించిన పూలను అస్సలు బయటకు తీసుకురారు. వాటిని స్వామివారి వెనుక వైపు విసిరేస్తారు. చిత్రం ఏమిటంటే ఆ పూలు.. తిరుపతికి దాదాపు twenty కిమీల దూరంలో ఉండే వేర్పేడులో తేలుతాయి. స్వామి విగ్రహం వెనుక ఉండే జలపాతం ద్వారా అవి అక్కడికి చేరుతాయని చెబుతుంటారు.
8. స్వామివారి విగ్రహం వెనుక భాగం ఎప్పుడూ చమ్మగా ఉంటుంది. ఎన్నిసార్లు తుడిచినా తడిగానే ఉంటుంది.
9. వేంకటేశ్వర స్వామి గుండె మీద లక్ష్మీ దేవి ఉంటుంది. నిజరూప దర్శనం సమయంలో స్వామివారికి అలంకరించే చందనాన్ని తొలగించేప్పుడు.. లక్ష్మీదేవి రూపం అచ్చులా వస్తుంది.
10. ఆలయంలో స్వామి విగ్రహం వద్ద ఏ రోజూ కొండెక్కవు. నిత్యం వెలుగుతూనే ఉంటాయి. అవి కొన్నివేల సంవత్సరాల నుంచి వెలుగుతున్నాయంటే నిజంగా ఆశ్చర్యకరమే.
11. 19వ శతాబ్దంలో స్వామివారు ఆలయం వద్ద ప్రత్యక్షమైనట్లు చెబుతుంటారు. ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ఓ రాజు గుడి వద్ద తప్పు చేసినందుకు వాళ్లను ఉరితీసి ఆలయ గోడలకు వేలాడదీశారని, దీంతో ఆ ఆలయాన్ని twelve ఏళ్లపాటు మూసివేశారు. ఆ సమయంలోనే స్వామివారు ప్రత్యక్షమైనట్లు స్థానికులు చెబుతారు.
12. సాధారణంగా పచ్చ కర్పూరానికి ఎలాంటి రాతి విగ్రహమైనా బీటలువారుతుంది. అయితే, శ్రీవారికి నిత్యం కర్పూరం రాస్తున్నా.. చెక్కు చెదరకపోవడం విశేషం. అలాగే, ఈ విగ్రహం దాదాపు a hundred and ten డిగ్రీల Fahrenheit ఉంటుందట. అయితే, ఆలయం సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తులో ఉండటం వల్ల ఆ ప్రభావం కనిపించడం లేదు. ప్రతి గురువారం విగ్రహానికి నిర్వహించే పవిత్ర స్నానం సందర్భంగా ఆభరణాలు తొలగిస్తారు. ఈ సందర్భంగా గర్భగుడిలో తీవ్ర ఉక్కపోత ఉంటుంది.
Leave Comments
Post a Comment